టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా , పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా , గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ సినీ రచయిత అయినటువంటి గోపాల కృష్ణ "ది ఫ్యామిలీ స్టార్" మూవీ గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. తాజాగా గోపాల కృష్ణ మాట్లాడుతూ ... దాదాపు చాలా సినిమాలలో హీరో మంచివాడైనా కూడా కొన్ని సందర్భాలలో జరిగిన తప్పులతో హీరోయిన్ హీరోని అపార్థం చేసుకుంటూ ఉంటుంది. కానీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ లో హీరోయిన్ మంచిదే కానీ కొన్ని కారణాల వల్ల హీరో ఆమెని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అలా వారి మధ్య చిన్న గొడవ కాస్త చాలా పెద్దది అవుతుంది.

ఇలానే ఈ సినిమా మొత్తం ముందుకు వెళుతుంది. హీరోయిన్ కి ఒక వ్యక్తి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు విజయ్ అతని తో గొడవ పెట్టుకుంటాడు. ఇక అప్పుడు చూపించిన వ్యక్తిని మళ్ళీ క్లైమాక్స్ లో చూపించి అతనితో హీరోయిన్ కి పెళ్లి చేయాలి అనుకుంటారు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలానే ఈ సినిమా గురించి అనేక అభిప్రాయాలను కూడా తాజాగా పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pgk