ఇక తాజాగా ఈ అమ్మడు భర్తతో కలిసి సొంతంగా సినీ నిర్మాణం కూడా స్టార్ట్ చేసింది. తన భర్త నితీష్ తో కలిసి మరాఠీలో వేద్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మజిలీకి రీమేక్ గా వచ్చిన ఈ వేద్ సినిమా బాలీవుడ్ లోనూ భారీ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ప్రశంసలు అందాయి.ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న హీరోయిన్స్ ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలేసి కుర్రాళ్లను తమ వైపు తిప్పుకున్న బ్యూటీస్ ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో సెటిలైయి పెళ్లి చేసుకుని ..పిల్లలను కనీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తాము ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు బ్యూటీస్ . తాజాగా అదే లిస్టులోకి రాబోతుంది హీరోయిన్ జెనీలియా .హ..హ..హ హాసిని అంటూ తనదైన స్టైల్ లో బొమ్మరిల్లు సినిమాలో నటించి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న హాసిని అదే మన జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేసి ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో అభిమానులతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది . రీసెంట్గా జెనీలియా కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులో రియంట్రి ఇవ్వబోతుందట . అయితే ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఆ హీరోకి అక్క పాత్రలో కనిపించబోతుందట . ఆశ్చర్యం ఏంటంటే జెనీలియా కన్నా వయసులో పెద్దవాళ్లయిన త్రిష - నయనతార ఇప్పటికీ హీరోయిన్స్ గా మెప్పిస్తున్నారు . అయితే జెనీలియా మాత్రం ఎందుకు అక్క రోల్ చూస్ చేసుకుంది అనేది మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. దీంతో జెనీలియా తీసుకునే డెసిషన్ కరెక్టేనా అన్న సందిగ్ధంలో పడిపోయారు అభిమానులు. ఏ రోల్ అయితే ఏం నటనతో మెప్పిస్తే చాలు అనేదే జెనీలియా ఒపీనియన్ .. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటున్నారు అభిమానులు