ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తాతా వస్తాడే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఇందులో సిద్ధార్థ్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇక ఇటీవల చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సిద్ధార్థ్ పెద్దగా విజయం సాధించలేకపోయాడు. దీంతో తన తదుపరి చిత్రంపై తన ఆశలను పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
వివాహం అనంతరం రకుల్ చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ని అందిస్తుందో వేచి చూడాలి. ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే బాలీవుడ్ లో తనకి ఎదురు నిలబడే వారే లేరు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన ముద్ర వేశాడు కమల్ హాసన్. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక కమలహాసన్ తన కెరీర్లో చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే భారతీయుడు సినిమా మాత్రం మరొక ఎత్తు. ఈ సినిమాతో ఒక సంచలనం సృష్టించాడు కమలహాసన్. మరి ఈ మూవీ సీక్వెల్ తో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటాడో చూడాలి.