రామోజీ రావు గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా ఎంతో మంది కి ఉపాధి కల్పించి గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇకపోతే రామోజీ రావు గత కొంతకా లంగా అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఇక నిన్న రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

ఇది ఇలా ఉంటే ఆయన తెలుగు భాషను దశ దిశల వ్యాప్తి చెందడం కోసం ఎంతో ప్రముఖ పాత్రను పోషించారు. అందులో భాగంగా మన తెలుగు భాషలో ఇంగ్లీష్ , ఉర్దూ , హిందీ మరియు వేరే ఇతర భాష పదాలను లేకుండా ఉండేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే "తెలుగు వెలుగు" అనే మాస పత్రిక కు శ్రీకారం కూడా చుట్టారు. ఇక ఈనాడు అనే దిన పత్రికను రామోజీ రావు నడిపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో కూడా ఆంగ్ల పదాలకు మరియు ఇతర భాష పదాలకు చోటు లేకుండా కేవలం తెలుగు పదాలు వచ్చే విధంగా ముందుండి నడిపించాడు. ఇలా తెలుగు భాష బ్రతకడం కోసం , తెలుగు భాష ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందడం కోసం రామోజీ రావు ఎంతగానో కృషి చేశారు. అలాగే తాను నడుపుతున్న సంస్థలలో తెలుగు పదాలకు తప్ప వేరే పదాలకు చోటు లేకుండా చూసుకున్న నేపథ్యం లో ఈయనకు ఎంతో మంది నుండి గొప్ప గొప్ప ప్రశంసలు లభించాయి. ఇలా ఆయన తెలుగు భాష పై తన అభిమానాన్ని ఎంతగానో చాటుకొని గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: