కమలహాసన్ సారిక గొడవలతో అటు శృతిహాసన్ అక్షరహాసన్ ఇద్దరు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారట.. ముఖ్యంగా తమ కూతుర్ల భవిష్యత్తు ఏమవుతుందని విషయం పైన కమలహాసన్ ఎక్కువగా బాధపడుతూ ఉండేవారని సమాచారం. జూన్ 2001లో సారిక చెన్నైలోని తన సొంత ఇంట్లో నుంచి టెర్రస్ నుంచి పడిపోయిందట దీంతో దాదాపుగా ఆమె ఒక నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు సమాచారం. మొదటిసారిగా కమలహాసన్ సారిక 1982లో రాజ్ కుమార్ కోహ్లీ రాజ్ తిలక్ సెట్ లో కలుసుకున్నారట.
ఆ తర్వాత కొన్నేళ్లపాటు ప్రేమించుకుని 1990లో వివాహం చేసుకున్నారు. అలా రెండు దశాబ్దాల పాటు సజావుగా సాగిన వీరి కాపురం కొన్ని విభేదాలు వల్ల విడిపోవలసి వచ్చిందనే వార్తలు వినిపించాయి. ఆ సమయంలో కమలహాసన్ కూతుర్లు కూడా తనతో మాట్లాడేవారు కాదని తెలుస్తోంది. ఒకే ఇంట్లో ఉన్న వీరందరూ కూడా అపరిచితుల్లా ఉండిపోయారట. ఇలాంటి ఎన్నో బాధలు ఉన్నప్పటికీ సినిమాల విషయానికి వస్తే ఫర్ఫెక్ట్ ఫేస్ ని మెయింటైన్ చేస్తూ సినిమాలను కూడా పూర్తి చేసేవారట. అయితే వీరిద్దరూ మధ్య విభేదాలని తమ స్నేహితుడికి చెప్పడానికి వెళ్ళినప్పుడే వీరిద్దరి బ్రేకప్ జరిగినట్లు తెలుస్తోంది.
అలా కమలహాసన్ సారిక విడిపోయినప్పుడు సారిక ధైర్యంగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించింది అయితే ఈ విషయం కమల్ హాసన్ కు మాత్రం మింగుడు పడలేక పోయిందట. అయితే తన పిల్లలు బాగుకోసం తన బాగు కోసం సారిక సినిమాలలో నటిస్తుందని తెలుసుకున్న కమలహాసన్ ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల భవిష్యత్తు గురించి పోషణ గురించి ఆలోచించాను వారు తనని కోరుకున్నట్లు అయితే వారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటానంటూ తెలియజేశారట. ముఖ్యంగా వారు చదువులు వారి భవిష్యత్తు గురించి భయపడే ఇలాంటి నిర్ణయాన్ని తెలిపారు అంటూ కమలహాసన్ అప్పట్లో తెలియజేశారట. చివరికి సారిక దగ్గర డబ్బులు లేక థియేటర్ ఆర్టిస్టుగా కూడా చేసిందట.