నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాని సినిమా వస్తుందంటే అభిమానులలో తెలియని  ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కొన్ని కథలు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయినప్పటికీ కూడా నాని నటనతో ఆ సినిమాని ఆకట్టుకుంటుంది. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన ఫిల్మ్ లో "భీమిలి కబడ్డీ జట్టు" అనే సినిమా తన కెరీర్ లో నిలిచిపోయింది. ఈ సినిమా థియేటర్స్లలో అంతగా ఆకట్టుకోకపోయినా నాని నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2010లో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో ఉండగా నాని పల్లెటూరి కుర్రాడి లాగా ఇందులో కనిపించాడు.


అయితే ఈ మూవీను తమిళ వెన్నెల కబడి కుళుకు రీమేగా చేశారు. ఇందులో నానికి సరసన శరణ్య మోహన్ నటించింది. ఇక ఇందులో వీళ్ళిద్దరి జంట చూడ ముచ్చటగా కనిపించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాలే చేసినప్పటికీ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈమె తమిళ్, మలయాళ వంటి సినిమాలలోనే కాకుండా కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా నటించింది. కృష్ణుడు హీరోగా నటించిన విలేజ్ సినిమాలో వినాయకుడి తో కలిసి తెలుగు ఇండస్ట్రీలోకి  అడుగు పెట్టింది. దాని తర్వాత భీమిలి కబడ్డీ, హ్యాపీ హ్యాపీగా, కళ్యాణ్ రామ్ కత్తి వంటి సినిమాలలో నటించింది. కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించి ప్రేక్షకులను అలరించింది.  


దాని తర్వాత ఈమె మళ్లీ తెలుగు సినిమాలలో నటించలేదు. ఇక దాని తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు అయినా అరవింద్ కృష్ణన్ ను  2015లో పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలను జన్మనిచ్చింది. ఇక ఆమె వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై మోహన్ సోషల్ మీడియాలో అడపాదడపా  ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అప్పుడు ఎంత క్యూట్ గా కనిపించింది ఇప్పటికీ కూడా అలానే క్యూట్ గా ఉంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన క్యూట్ క్యూట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: