సూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు  ఈ మూవీ లో రమ్యకృష్ణ , రజినీ కాంత్ కి భార్య పాత్రలో నటించగా , తమన్నా , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

మూవీ ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా జైలర్ 2 మూవీ ని రూపొందించబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇకపోతే జైలర్ 2 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైలర్ మూవీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి మోహన్ లాల్ ,  శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించారు.

ఇక జైలర్ 2 లో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఈయన పాత్ర నిడివి చాలా తక్కువ ఉన్నప్పటికీ , సినిమాలో చిరు పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజం గానే చిరు ఈ సినిమాలో నటిస్తున్నాడా ..? లేదా అనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ చిరంజీవి కనుక జైలర్ 2 మూవీలో నటించినట్లు అయితే ఈ సినిమా క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: