అయితే హార్రర్ కామెడీ సినిమా అనే మాట వినబడినప్పుడల్లా ప్రతి ఒక్కరికి గుర్తుకువచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాలలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చే కాంచన సిరీస్ సినిమాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఏకంగా కాంచన సిరీస్ లో మూడు హార్రర్ కామెడీ సినిమాలను తీశాడు రాఘవ లారెన్స్. ఇక ఇందులో అతనే హీరోగా నటించి తన నటనతో విశ్వరూపం చూపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే కాంచన సిరీస్ లో విడుదలైన మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కాంచన 4 సినిమాకి అంత సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక కాంచన ఫోర్ కూడా లారెన్స్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఈ మూవీలో స్టార్ హీరోయిన్ మృనాల్ ఠాగూర్ ఇక హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకుంది అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ప్రస్తుతం కాంచన 4 మూవీ టీం మృనాల్ ఠాగూర్ తో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారట. అయితే సెప్టెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.