ఎంతోమంది సెలబ్రిటీలు ప్రెసెంట్ కాలంలో విడిపోతూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికే అనేకమంది ఈ దారిలో నడిచారు. ఇక చూపులు కలిసిన శుభవేళ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ దల్జిత్ కౌర్. హీరోయిన్ అక్క పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈమె ఇప్పటికే మొదటి భర్తతో విడిపోయిన సంగతి తెలిసిందే.

కొన్ని రోజులపాటు తన కుమారుడితో ఒంటరిగా ఉంటుంది. ఇక తరువాత దుబాయ్ లో ఫ్రెండ్ పార్టీ లో పరిచయమైన అయినా నిఖిల్ ను ప్రేమించి పెళ్లాడింది. అతడితో జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని భావించిన ఈమె చెడు అనుభవాలనే మిగులుచుకుంది. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉండడం వల్లే తన్ను దూరం పెడుతున్నాడు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇక దీనిపై స్పందించిన రెండవ భర్త.. తన గురించి ఇలా అడ్డగోలుగా మాట్లాడితే బాగోదని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా తాజాగా ఇతను తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఓ ఫోటో షేర్ చేశాడు.

అందులో గతంలో దల్జిత్ ‌ వేసిన పెయింటింగ్ కనిపించకుండా గోడకు తెలుపు రంగు వేసినట్లు చూపించాడు. ఇక ఇది చూసిన నటి.. గోడ మీద ఉన్న ఆర్ట్ ని తొలగించినంత ఈజీ కాదు నిజాన్ని నువ్వు మాయం చేయడం.. అంటూ గోరంగా వ్యాఖ్యలు చేసింది. కాగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరుగుతున్న  వార్ ఎంత దూరం వెళ్లనుందో చూడాలి. ఎక్కువ శాతం సెలబ్రిటీలు పెళ్లయిన అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటున్నారు. కొంతమంది విడాకులు అనంతరం ఒకరిపై ఒకరు అస్సలు కామెంట్స్ చేసుకోవడం లేదు. కానీ మరి కొంతమంది మాత్రం పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ కోవా కి చెందిన వారే వీరు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: