టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న బాడ హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు.  సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందుపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వరస సినిమాలు చేస్తూ తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు మహేష్. ఇక తాజాగా మహేష్ బాబు హీరోగా శ్రీ లీల హీరోయిన్గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌ మూవీ గుంటూరు కారం.

మూవీ రిలీజ్ అనంతరం డీసెంట్ టాక్ సంపాదించుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం జోరుగానే రాబట్టింది. అయితే ఈ మూవీలో థమన్ కంపోజ్ చేసిన సెన్సేషనల్ హిట్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కూడా ఒకటి. ఇక ఈ సాంగ్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. మన తెలుగు నుంచి ఫాస్టెస్ట్ 100 మిలియన్ నుంచి 200 మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్స్ లో ఒకటిగా అదిరా రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ పాట ఇప్పుడు రెండు మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక దీంతో పాటుగా సాంగ్ ఇప్పుడు 3 మిలియన్ వ్యూస్  దిశగా దూసుకెళ్తున్న అన్ స్టాపబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు.

ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రామకృష్ణ తదితరులు నటించగా హారిక హాసిని వారు దీనిని నిర్మించారు. మంచి అంచనాలతో థియేటర్ల వద్ద రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుంకుది. ఇందుకు కారణం స్టోరీ రొటీన్ గా ఉండటమే. స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ని చూసేందుకు పెద్దగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనికి తోడు అదే సమయంలో హనుమాన్ మూవీ మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈ మూవీని చూసే సాహసం ఎవరు చేయలేదు. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఓస్టార్   హీరో సినిమా అంటే ఆ మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ మినిమం కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈ సినిమాతో మరోసారి ఇది ప్రూవ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: