సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా దానిని వెతికి పట్టుకోవడం ఆయనకు అలవాటు. అలాగే ఎవరైనా మంచి దర్శకులు మంచిగా సినిమాలు తీస్తున్నారు అంటే వారు ఏ భాష వారు అయినా సరే వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అలా కొంత మంది తమిళ దర్శకులకు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లో అవకాశాలను ఇచ్చాడు. కానీ మహేష్ నమ్మకాన్ని మాత్రం కొంత మంది తమిళ దర్శకులు నిలబెట్టుకోలేకపోయారు.

అసలు ఆ తమిళ దర్శకులు ఎవరు..? మహేష్ ఏ సినిమాలతో వారికి అవకాశాలు ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో ఓ వైపు తమిళ దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య మంచి విజయాలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అలాంటి సమయం లోనే మహేష్ తమిళ దర్శకుడు అయినటువంటి సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమాలో హీరో గా నటించాడు. మహేష్ తన స్టార్ స్టేటస్ ను పక్కన పెట్టి మరి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో హీరోగా నటించాడు.

ఎస్ జె సూర్య కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కానీ వీరిద్దరి కష్టనికి తగిన ఫలితం ఈ సినిమా ద్వారా రాలేదు. ఇక తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురుగదాస్ , మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ రిజల్ట్ చూస్తే ఘోరంగా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా రెండు సార్లు తమిళ దర్శకులను నమ్మిన మహేష్ బాబు రెండు మూవీ లతో కూడా ఫ్లాప్ లను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: