ఇక తెలంగాణ ప్రభుత్వ వర్గాలతో కూడ అశ్వినీ దత్ కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఆకాశమే హద్దు అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ కు ఏర్పడ్డ మ్యానియాను చూస్తుంటే ఈ మూవీ చాల సులువుగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఓపెనింగ్ కలక్షన్స్ రికార్డును బ్రేక్ చేస్తుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.
ఓవర్సీస్ లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన మొదటిరోజున 5 వేల టిక్కెట్లు అమ్మకం జరిగినట్లు వస్తున్న వార్తలను బట్టి ఈమూవీ పై మ్యానియా ఏరేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. తెలుస్తున్న సమాచారం మేరకు కేవలం అమెరికాలో ఈమూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ 116 లొకేషన్స్ లో జరుగుతున్నాయని ఈ మూవీకి ప్రస్తుతం వస్తున్న స్పందన చూస్తుంటే ఈ లొకేషన్ సంఖ్య మరింత పెరిగే ఆస్కారం ఉంది అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జూన్ 20 తర్వాత ఏ నిమిషమైనా టిక్కెట్స్ ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభం అవుతాయని సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ టిక్కెట్లకు ఏర్పడ్డ మ్యానియాను చూస్తుంటే బుక్ మై షోలో ఈమూవీ టిక్కెట్ల అమ్మకం ప్రారంభం అయిన కొన్ని నిముషాలలోనే ఆ యాప్ క్రాష్ అయినా ఆశ్చర్యయంలేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..