ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగాన్ని షేక్ చేస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవి సుందర్ మ్యానియా ఇండస్ట్రీలోని చాలామందికి ఏర్పడటంతో అతడు డిమాండ్ చేస్తున్న మూడుకోట్ల పారితోషికాన్ని బడా నిర్మాతలు మరొక ఆలోచన లేకుండా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇతడి మ్యానియా బాలీవుడ్ లో కూడ కనిపిస్తూ ఉండటంతో ఇతడికి వరస పెట్టి అవకాశాలు కూడ వస్తూనే ఉన్నాయి.



ఇతడు సంగీత దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ కు సంబంధించిన జూన్ నెలలో జరిగిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న కమలహాసన్ ఈమూవీ పాటల పై అభిమానూలు పెదవి విరుస్తున్నారు అన్న మాటలు వస్తున్నాయి. అంతేకాదు ‘దేవర’ మూవీకోసం అనిరుద్ ను ఏరికొరి సుమారు 5 కోట్ల భారీ పారితోకం ఆఫర్ చేయడంతో ఆ న్యూస్ వైరల్ గా మారింది.



ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విడుదలైన ‘ఇండియన్ 2’ పాటలు వినీ చాలామంది అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘ఇండియన్ 2’ లేటెస్ట్ ఆల్బమ్ లేటెస్ట్ కలక్షన్స్ అంతంత మాత్రంగా ఉండటంతో ఈమూవీకి ఏమైంది అంటూ తారక్ అభిమానులు టెన్షన్ పడతామే కాకుండా ‘భారతీయుడు2 ’ మూవీలోని పాటలను గతంలో రెహమాన్ స్వరపరిచిన ‘భారతీయుడు’ మూవీలోని పాటలతో పొలుస్తూ ‘భారతీయుడు 2’ పాటలు చాల నాసిరకంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.



ఈవిషయాలు అన్నీ తారక్ అభిమానుల దృష్టి వరకు వెళ్లడంతో ‘దేవర’ విషయాయంలో కూడ అనిరుద్ ఇలాగే ట్యూన్స్ ఇచ్చి ఉంటాడా అంటూ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదల అయిన మొదటి పాటకు స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో అనిరుద్ ఈసినిమాకు సంబంధించిన మిగతా పాటలకు ఎలాంటి ట్యూన్స్ ఇచ్చి ఉంటాడు అన్న భయం తారక్ అభిమానులను వెంటాడు తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఎంతవరకు ‘దేవర’ విషయంలో న్యాయం చేయగలడు అన్న తారక్ అభిమానుల భయాలతో పాటు అనిరుద్ భయాలు కూడ తొడయ్యాయి అనుకోవాలి.  





మరింత సమాచారం తెలుసుకోండి: