'కల్కి 2898 AD' ట్రైలర్ ఈ రోజే విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. కానీ ఆ ట్రైలర్ విడుదలకు ముందే మేకర్స్‌కు ఉలిక్కిపడే ఓ షాక్ తగిలింది. మొన్నటిదాకా మేకర్స్ మూవీ స్టోరీ గురించి ఎంతో సస్పెన్స్‌ క్రియేట్ చేశారు. చివరికి జూన్ 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు ట్రైలర్‌తో సర్‌ప్రైజ్ చేయాలని ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ భావించింది. కానీ ఓ లీక్ స్టర్ వారి ఆశల మీద నీళ్లు చల్లాడు. అతడి కారణంగా ఈ ట్రైలర్ అఫీషియల్ రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'కల్కి' ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.


సాధారణంగా ట్రైలర్ రిలీజ్ చేసే ముందు సెన్సార్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. దీని ఫలితంగా టీవీలు లేదా సినిమా థియేటర్లు వాటిని అభ్యంతరం లేకుండా ప్లే చేసుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 'కల్కి 2898 ఏడీ' మేకర్స్‌ సైతం సెన్సార్ క్లియర్ చేసుకోవడానికి సంబంధిత అధికారులకు ట్రైలర్ సెండ్ చేశారు. అయితే, ఆ అధికారులలో ఒకరు ట్రైలర్‌ను వీడియో రికార్డ్ చేసి ఓ స్నేహితుడికి వాట్సాప్ లో వ్యూ వన్స్ మీడియాగా పంపించాడు. ఒకసారి మాత్రమే ఫ్రెండ్ చూసేస్తాడు, ఆ తర్వాత అది మాయమైపోతుంది, తనకి ఎలాంటి ఇబ్బంది లేదని అతను అనుకున్నాడు.
అయితే ఆ ఫ్రెండ్ మాత్రం అతి తెలివితేటలు ప్రదర్శించాడు.

 ఈ ట్రైలర్‌ను ఎలాగో షేర్ చేయడం కుదరదు కాబట్టి వేరే ఫోన్ నుంచి దాన్ని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత నెట్టింట్లో లీక్ చేశాడు. ఇంకేముంది అది సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేసింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మండి పడుతున్నారు. కనీసం కేర్ తీసుకోరా? ట్రైలర్ రిలీజ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించలేదా? అని ఫైర్ అవుతున్నారు. ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ మీద, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ లపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: