నందమూరి ఫ్యామిలీ లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు నుంచి ప్రారంభమైంది. ఆయన పేరుతో జూ ఎన్టీఆర్‌ వచ్చాడు. సత్తా చాటుతున్నాడు. కానీ ఇప్పుడు మరో ఎన్టీఆర్‌ వస్తున్నాడు.నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీకి ఆజ్యం పోసిన ఎన్టీఆర్‌ వారసులుగా ఇప్పటికే చాలా మంది నటులు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. రాణిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొడుకులుగా బాలకృష్ణ ఒక్కడే సక్సెస్‌ అయ్యాడు. కొన్నాళ్లపాటు హరికృష్ణ కూడా అలరించారు. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యారు.ఇక మూడో తరం నటుల నుంచి ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు కళ్యాణ్‌ రామ్‌ హీరోగా అలరిస్తున్నారు. తారకరత్న హీరోగా కొన్ని సినిమాలతో మెప్పించారు. కానీ ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు.హరికృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు మరో ఎన్టీఆర్‌ రాబోతుండటం విశేషం. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్‌ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విసయం తెలిసిందే. ఆయన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రేపే ఆయన మూవీ ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుండటం విశేషం. సోమవారం గ్రాండ్‌గా ఈ సినిమా ఓపెనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంది.

 ఇదిలా ఉంటే హీరోగా పరిచయం కాబోతున్న జానకీ రామ్‌ కొడుకు పేరే ఎన్టీఆర్‌ కావడం విశేషం. ఆయనకు కూడా నందమూరి తారక రామారావు అనే పేరునే పెట్టారట. ఇప్పటికే సీనియర్‌ ఎన్టీఆర్‌, ఇప్పుడు జూ ఎన్టీఆర్‌ ఉండగా, మరో ఎన్టీఆర్‌ హీరోగా పరిచయం కాబోతుండటం విశేషంగా చెప్పాలి. నందమూరిఫ్యాన్స్ కిది సంతోషకరమైన విషయమనే చెప్పాలి. అదే సమయంలో ఈ ఎన్టీఆర్‌ నేమ్‌ పెద్ద కన్‌ఫ్యూజన్‌గానూ మారే అవకాశం ఉంది. ఈ కొత్త ఎన్టీఆర్‌ని ఏమని పిలుస్తారో చూడాలి. కానీ ఇది ఓ రకంగా కన్‌ఫ్యూజన్‌ మ్యాటర్‌గా మారుతుందని చెప్పొచ్చు.ఓ లెజెండరీ నటుడి పేరు పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఆ పేరుని వాడుకుని ఆ స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతే విమర్శల పాలవక తప్పదు. జూ ఎన్టీఆర్‌ ఆ స్థాయిలో మెప్పిస్తున్నాడు. అద్భుతమైన నటుడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా మారుతున్నారు. తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు. మరి కొత్తగా రాబోతున్న కుర్ర నందమూరి తారక రామారావు ఆ స్థాయికి చేరుకుంటాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: