ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరఫున యాంకర్ శ్యామల పిఠాపురం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గోరాది గోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అంటే జనసేన కార్యకర్తలు ఆమెను ఘోరాది గోరంగా ట్రోల్స్ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల ఫలితాలలో కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో వైసిపి తరుపున ప్రచారం చేసిన వారిని టిడిపి కేడర్ టార్గెట్ చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు.

అయితే గతంలో చంద్రబాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలు పై తాజాగా దర్శకుడు గీతాకృష్ణ స్పందించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుపై శ్యామల చెప్పిన కథ గురించి ఆయన ప్రస్తావించారు. " చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ పై శ్యామల చెప్పిన కదా గురించి నాకు తెలిసింది. ఎన్నికల్లో కూటమి విజయం తరువాత అసలు శ్యామల ఎక్కడ. ఇప్పుడు చెప్పమను జగన్ కి కథలు. ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు శ్యామలకు డబ్బు నో లేదంటే మరేదో ఆశించి ప్రచారం చేసి ఉంటుంది. వంగా గీత  పిఠాపురంలో ఓడిపోతుందని నేను ఎప్పుడో చెప్పాను.‌ శ్యామల ఎవరో కూడా జనాలకి తెలియదు. ఇప్పుడు జగన్ కే అడ్రస్ లేదు.

రాజకీయాల గురించి ఆమెకి ఏం తెలుసు. మొగుడిపై ఏవో కేసులు ఉన్నాయని ప్రచారానికి వెళ్లాలనుంటుంది. ఇక ఆమెకు అవకాశాలు కూడా రావు.కాళ్లు పై పడాల్సిందే లేదంటే కష్టం. నువ్వేమన్నా పెద్ద పొలిటిషన్ అనుకున్నావా. పోనీ హీరోయిన్ వా. ఏ బొంగు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు " అంటూ యాంకర్ శ్యామలపై గోరాది గోరంగా విరుచుకుపడ్డాడు డైరెక్టర్. ప్రజెంట్ ఈ డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలను  చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: