అయితే గతంలో కూడా కోర్టు ఎన్నో ఆదేశాలను జారీ చేసినప్పటికీ వాటిని పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ బెయిల్ అరెస్టు వారేంటిని కోర్టు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన కమెడియన్ పృథ్వీరాజ్ 1984లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నది. అయితే పృధ్విరాజ్ తన భార్యకు విడాకులు ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం వీరు విడివిడి గానే ఉంటున్నారట. శ్రీలక్ష్మీ తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం.
2017లో విడాకులు విషయం పైన ఇరువురు కోర్టును ఆశ్రయించారు. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల రూపాయలు భరణం ఇప్పించాలంటూ కోర్టులో తెలియజేసింది పృద్వి రాజ్ భార్య.. పృధ్విరాజ్ సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబామే భరించేదని అయితే సినిమాలలోకి వచ్చాక తనను వేధిస్తూ ఉండేవారని 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటి నుంచి వచ్చేసానంటూ పృథ్వీరాజ్ భార్య అప్పట్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.అయితే అప్పటికే పృథ్వీరాజ్ పలు రకాల టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉండేవారని అలా నెలకు రూ .30 లక్షల రూపాయల వరకు సంపాదించారు. కాబట్టి 2017లో కేసు దాఖలు చేశారు. 2022లో ఇందుకు సంబంధించి తీర్పు కూడా వెలువబడింది. అయినప్పటికీ ఆమెకు ఖర్చైన కోర్టు ఖర్చులతో పాటు ప్రతినెల రూ .8 లక్షల రూపాయలు ప్రతి నెల 10వ తేదీన చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు నాన్ బెయిల్ వారింటిపైన జారీ చేసినట్లు సమాచారం.