మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సమయం బాగా కలిసివస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు క్లింకార జన్మించిన తర్వాత అన్నిరకాలుగా ఆ కుటుంబానికి కలిసివస్తోందని అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.క్లింకార జన్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు అవార్డు వచ్చింది. తర్వాతే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. తర్వాత చిరంజీవి భార్య సురేఖ ఇంట్లోనే ఉండి అత్తమ్మ కిచెన్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించింది.ఆ తర్వాత ఎప్పటినుంచో అభిమానులు కలలు కంటున్న పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవడం జరిగిపోయింది. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడమేకాదు.. మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వరుసగా మెగా కుటుంబానికి అన్నీ కలిసివస్తున్న తరుణంలోనే మరో శుభవార్త వినిపించారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించి పెద్దలు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఎవరిని చేసుకోబోతున్నాడు? అనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ ఒకరు. ఎక్కువశాతం మెగా ఫ్యామిలీతో తను సెలబ్రేట్ చేసుకున్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు ఈ హీరో. సాయి ధరమ్ తేజ్, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" చిత్రంతో చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టి, "పిల్లా నువ్వులేని జీవితం" చిత్రంతో తెరంగేట్రం చేసాడుక్లింకార పుట్టిన తర్వాత అందరికీ కలిసివస్తున్న తరుణంలోనే నిహారిక కూడా జీవితంలో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అలాగే శ్రీజ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. చిరంజీవి పెద్ద కూతురు నిర్మాతగా మారింది. చిరంజీవి కుటుంబానికి అదృష్టం అనేది వారి జేబులోనే పెట్టుకొని ఉన్నారని, ఆ కుటుంబం మట్టి పట్టుకున్నా బంగారమే అవుతోందంటున్నారు. ఏదేమైనప్పటికీ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ మంత్రి కావడాన్ని ప్రత్యక్షంగా దగ్గరుండి మరీ చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: