Vishwak Sen: మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ యాక్షన్ మూడ్లో దుమ్ము రేపాడు విశ్వక్. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా గ్యాంగ్ షాప్ గోదావరి తన జోరుని చూపించింది. ఇక ప్రస్తుతం మెకానిక్ రాకి మూవీలో హీరోగా నటిస్తున్నాడు విశ్వక్సేన్. అయితే ఈ చిత్రం డేట్రికల్ హక్కుల గురించి విశ్వక్ చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

" మెకానిక్ రాకి " మూవీ ఆల్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నట్టు సురేష్ ఆసియన్ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. ఇక ఈ విషయంపై మంగళవారం అనగా జూన్ 11న అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయంపై వచ్చిన ఓ ట్వీట్కు విశ్వక్సేన్ తాజాగా స్పందిస్తూ రిప్లై ఇచ్చారు. అసలు ఈ మూవీ హక్కులను ఇంకా విక్రమించలేదని ట్వీట్ చేశాడు. దీంతో ఈ అంశం వివాదం రేపుతుంది. ఈ మూవీ హక్కుల విషయంలో పోస్ట్ అయినా ఓ ట్వీట్ కు విశ్వక్సేన్ కామెంట్ చేశారు.

తమ మూవీ హక్కులను విక్రయించామన్న విషయంలో వాస్తవం లేదని పేర్కొన్నాడు. " డాంకీ ఎగ్ ఏం కాదు. జీఎస్టీతో అంట. టీ షాప్ ముచ్చట్లు తీసుకొచ్చి ట్విట్టర్లో పెడుతున్నారు. మెకానిక్ రాకి నీ ఇంకా అమ్మ లేదు. నిజాలను సరిగ్గా చెప్పండి. ఇది టీం కెరీర్ " అంటూ విశ్వక్ ఈ కామెంట్ కి రిప్లై ఇచ్చారు. ప్రజెంట్ విశ్వక్సేన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిట్ వీటిని చూసిన వారంతా ఇదో కొత్త రకం ప్రచారమా? బానే ఎగస్ట్రాలు చేస్తున్నారుగా.. మీరు మీ డ్రామాలు స్క్రీన్ పై చూపించండి ట్విట్టర్లో కాదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: