మంచు విష్ణు ఎన్నో ఎలాగా కలలు కంటున్నా ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీను భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్స్ అండ్ 24 ఫేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డి మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం అనగా జూన్ 14న కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేసింది టీం. ఇక ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ క్రమంలో నటుడు అండ్ నిర్మాత మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

" కన్నప్ప రానికి ఆయన కొత్తగానే ఉంటుంది. భక్తి భావం అండ్ ధుర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో భక్తితో దీనిని నిర్మించాం. భారతదేశంలోని నాలుగు మూలాల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా శరత్ కుమార్ పోషిస్తారు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు కలిగిన చిత్రం.

పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా చేసాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజు గారితో మాట్లాడడం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు గారు ఇచ్చేశారు " అంటూ తెలిపారు మోహన్ బాబు. ప్రజెంట్ ఈన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను వ్యాఖ్యాలని చూసిన వారంతా.. ఈ సినిమాలో ప్రభాస్ మెయిన్ హీరో అయి ఉంటే హైప్స్ వేరే లెవెల్ లో ఉండేవి. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఒక చిన్న క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నాడు. కృష్ణంరాజు ఇచ్చిన మాటని ప్రభాస్ ఎప్పుడు గౌరవిస్తాడు. దీనికి మరో నిదర్శనం ఇది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: