ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నా సినిమా ఏదైనా ఉంది అంటే అది కల్కి అనే చెప్పుకోవచ్చు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, దీపిక తో పాటు అమితాబచ్చన్ అండ్ కామన్ హాసన్ లాంటి వాళ్లు కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఇక వీరిని ఈ సినిమాలో డైరెక్ట్ చేయడం పై ఫిలిం కంపానియల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు చేశారు.‌ " కల్కి మూవీలో పెద్ద పెద్ద స్టార్లు నటించారు. మరి అలాంటి వాళ్ళను డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు.

ముఖ్యంగా నాలుగైదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ లాంటి వారిని ఎలా నటించాలో చెప్పడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. నేను డైరెక్ట్ చేసి అప్పటికి రెండేళ్లు అవుతుంది. ఈ చిత్రం కోసం నా తొలి షాట్ మిస్టర్ బచ్చన్ తోనే ఉండింది. ఈ సినిమాలో అతనివి కొన్ని మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కానీ అది అతడైనా, కమల్ సార్ ఆయన వాళ్లు తమను కూడా డైరెక్ట్ చేయాలనే అనుకుంటారు. వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగిన నేర్చుకుంటూనే ఉంటారు.

ప్రభాస్ లేదా దీపిక అయినా సరే వాళ్ళకున్న స్టార్డమ్ అండ్ వాళ్లకు ఉన్న ఫాన్స్ ఏం  కోరుకుంటారో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఈ సినిమాను నేను 10, 12 ఏళ్ల వయసున్నప్పుడు చూడడానికి ఇష్టపడే విధంగా తీశాను. ఈ సినిమాలో నేను పెట్టిన ప్రతి యాక్షన్ సీన్స్ ను నా పిల్లవాడు ఇష్టపడ్డాడు. కానీ మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన ఫుడ్ అండ్ వెహికిల్స్ పరస్పర సంబంధాలు వంటి విషయాలపై ఎటు తేల్చుకోలేకపోయాను. మూవీ ప్రారంభించినప్పుడు మనుషులు మాస్కులు పెట్టుకోవడం, ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించడం వంటివి ఆలోచించాం. ఇప్పుడు అవన్నీ నిజంగా జరుగుతున్నవి. నిజానికి ఇవి తలుచుకుంటూ ఉంటే చాలా సిలిగా అనిపిస్తుంది " అంటూ తెలియజేశాడు నాగ్ అశ్విన్. ప్రెసెంట్ ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: