టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకి సమానంగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఒకేసారి లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇకపోతే గత రెండేళ్లుగా వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇప్పుడు తన నాలుగు సినిమాలకి ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

 ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా తన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన తండ్రికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు. అయితే అందులో ఆయన తండ్రి గురించి మాట్లాడుతూ..అందులో చెర్రీ తన తండ్రీ గురించి గొప్పగా చెప్పాడు.. వయసు తగ్గుతుందని అనుకున్నా ఆయన తగ్గట్లేదు.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టినట్లు

 బయటపెట్టాడు.. ఒక టైం ప్రకారం అన్ని చేస్తాడు.. నేను ఒకటో, రెండో చేస్తున్నానంతే. మా నాన్న వయసు ఎక్కువ కాదు.. తక్కువ అవుతుందనిపిస్తోంది అని చరణ్ అనడం విశేషం.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.. నెక్స్ట్ మూవీస్ ను త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నాడని సమాచారం.. ఇటు చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు.. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యనున్నాడు.. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: