కన్నడ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆమె శ్రీవల్లిగా అందరినీ మెప్పించి దేశావ్యాప్తంగా కూడా వేరే లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది.ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుని నార్త్ టు సౌత్ చాలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తనదైన అందం, అభినయంతో ఎంతగానో అలరిస్తోంది. నాన్ స్టాప్ గా అనేక షూటింగ్స్ లో పాల్గొంటోంది అమ్మడు.ఇక ప్రస్తుతం ఆమె పుష్ప-2 మూవీలో శ్రీవల్లి 2.0గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ తో పాటు సూసేకి సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇంతలో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ పూర్తవ్వకపోవడమే పోస్ట్ పోన్ కు ప్రధాన కారణమని మేకర్స్ తెలిపారు. మంచి క్వాలిటీతో ఔట్ పుట్ ఇవ్వడమే తమ టార్గెట్ అని మేకర్స్ చెప్పారు.


బన్నీ స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు.డిసెంబర్ నెల 6వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. అయితే అదే ఇప్పుడు రష్మికకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ లో యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ఆమె చేస్తున్న చావా మూవీ అదే డేట్ న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో రష్మిక పుష్ప పోస్ట్ పోన్ విషయం పట్ల డిస్సపాయింట్ అయినట్లు తెలుస్తోంది. చావా సీజన్ కూడా ఇప్పుడు వాయిదా పడుతుందని అంటున్నారు.చాలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు తీసిన లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న చావా మూవీ.. ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి స్పెషల్ అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే పుష్ప, చావా కనుక ఒకేసారి విడుదలైతే.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ అనేది జరుగుతోంది. రెండు సినిమాల వసూళ్లపై కూడా ఎఫెక్ట్ బాగా పడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: