చందు ఛాంపియన్: బయోపిక్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్?బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చందు ఛాంపియన్. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి సోమవారం నుంచే వసూళ్లు దారుణంగా పడిపోయాయి.ఈ సినిమా నాలుగో రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూలు చేసింది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన చందు ఛాంపియన్ మూవీకి మొదటి రోజు రూ. 4.75 కోట్లు, రెండో రోజు రూ.7 కోట్లు, మూడో రోజు రూ.9.75 కోట్ల వసూళ్లు వచ్చాయి. తొలి అంచనాల ప్రకారం చందు ఛాంపియన్ నాలుగో రోజు ఇండియాలో దాదాపుగా రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. దీంతో చూసుకుంటే ఇప్పటివరకు ఈ సినిమా కేవలం రూ. 26.25 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది.ఇంకా అలాగే, చందు ఛాంపియన్ సినిమా ఓవర్సీస్ నుంచి నాలుగు రోజుల్లో రూ. 7.4 కోట్లు సాధించగలిగింది.  


నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 33 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే.. రూ. 120 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన ఈ మూవీకి నాలుగో రోజు కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.చందు ఛాంపియన్ సోమవారం కేవలం 20.67% హిందీ ఆక్యుపెన్సీని మాత్రమే సాధించింది. అంతకుముందు రోజుల ఆక్యుపెన్సీతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఇదిలా ఉంటే, ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన మురళీకాంత్ పెట్కర్ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ స్పోర్ట్స్ డ్రామాను రూపొందించారు.చందు ఛాంపియన్ అనేది ఒక దృఢమైన అథ్లెట్ స్ఫూర్తిదాయక కథను చెబుతుంది. ఈ మూవీలో చందు పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించాడు. విజయ్ రాజ్, భువన్ అరోరా ఇంకా అలాగే రాజ్పాల్ యాదవ్ వంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: