టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించిన హేమ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ఈమె బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో  డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ రావడంతో ఒక్కసారిగా ఈమె పేరు వైరల్ గా మారింది. అయినప్పటికీ హేమ ఈ పార్టీలో లేనట్లుగా ఆరోపణలు సైతం చేసినప్పటికీ బెంగళూరు పోలీసులు సైతం ఈమె పైన ఫోకస్ చేయడంతో చివరికి హేమ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం జరిగింది.. అయితే అరెస్టుకు ముందు హేమ తను అసలు అక్కడికి వెళ్లలేదని పలు రకాల వీడియోలు కూడా చేయడం జరిగింది.


అంతేకాకుండా తను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అంటూ ఒక సవాల్నీ కూడా విసిరింది. చివరికి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడం కూడా జరిగింది హేమ. కొన్ని రోజులుగా ఈ వార్త సంచలనంగా మారింది. జూన్ 14న హేమ బెయిల్  మీద బయటకు రావడం జరిగింది. దీంతో కదా పూర్తి అయినది అనుకుంటే.. హేమ సంబంధించి వార్తలకు కూడా చెక్ పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే హేమకు సంబంధించి తాజాగా ఒక ఫోటో ఒక కలకలాన్ని సృష్టిస్తోంది.


ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డిజె సిద్ధార్థ తో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాను మరొకసారి షేక్ చేస్తోంది. ఈ కేసులో ఇతడితో పాటు దాదాపుగా 16 మంది అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అలాంటి వ్యక్తితో జైలు శిక్ష అనుభవించి వచ్చిన హేమ ఫోటో దిగడం చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.. అసలు హేమ కు సిద్ధార్థ కు బెంగళూరు పార్టీకి లింక్ ఏంటి అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు.డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా పట్టుబడిన సిద్ధార్థ తో ఈమె ఫోటో దిగిందా అంటూ పరు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సిద్ధార్థ కేసులో హేమను కూడా లాగుతూ ఉండడంతో హేమ దూరంగా ఉండకపోతే ఖచ్చితంగా చిక్కులలో పడడం ఖాయమని చెప్పవచ్చు. మరి వీటి మీద హేమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: