మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "దేవర"..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి మేకర్స్ "ఫియర్ సాంగ్ " ను రిలీజ్ చేసారు." దూకే ధైర్యమా జాగ్రత్త ..దేవర ముందు నువ్వెంత "అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.అలాగే యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ కాస్త పెద్దది కావడం తో ఈ సినిమాను కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను ముందుగా అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కానీ తాజాగా ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.అయితే ఎన్టీఆర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయితే హిట్ అనే సెంటిమెంట్ వుంది.గతంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1 సినిమా సెప్టెంబర్ 27 2001 రిలీజ్ అయింది.అలాగే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్,జై లవ కుశ సినిమాలు  కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి.ఇప్పుడు దేవర కూడా స్టూడెంట్ నెం.1 రిలీజ్ అయిన తేదీనే రిలీజ్ అవుతుంది.దీనితో సెప్టెంబర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: