విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం మార్చిలో గామితో వచ్చిన విశ్వక్ సేన్ లాస్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో వచ్చాడు.కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విశ్వక్ సేన్ మాస్ యాంగిల్ ని కొత్తగా చూపించేలా చేశారు.ఈ సినిమా కూడా ఆడియన్స్ ని మెప్పించింది. ఐతే యంగ్ హీరోలంతా కూడా 100 కోట్ల సినిమాలతో అదరగొడుతున్న సందర్భంగా విశ్వక్ సేన్ కూడా నెక్స్ట్ సినిమా టార్గెట్ 100 కోట్లు పెట్టుకున్నాడు.అందుకోసం తను చేస్తున్న సినిమాలకు మరింత ఫోకస్ తో పనిచేస్తూ కసరత్తులు చేస్తున్నాడు.విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమాతో పాటుగా లైలా అనే సినిమా కూడా చేస్తున్నాడు. మెకానిక్ రాకీ సినిమాని రవితేజ ముల్లపూడి డైరెక్ట్ చేస్తుండగా.. లైలా సినిమాకు రామ్ నారాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లే తో వస్తున్నాయని సమాచారం తెలుస్తుంది.


విశ్వక్ సేన్ ఈ రెండు ప్రాజెక్ట్ ల మీద బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.మెకానిక్ రాకీ సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉండగా లైలా మూవీని ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లారని సమాచారం తెలుస్తుంది. యంగ్ హీరోల్లో సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ సత్తా చాటుతున్న విశ్వక్ సేన్ రాబోతున్న సినిమాలతో కూడా తన స్టామినాని చూపిస్తాడని అంటున్నారు. ఐతే ఈసారి టార్గెట్ ని భారీగా ఫిక్స్ చేసుకుని అందుకు తగినట్టుగానే వర్క్ అవుట్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తారని సమాచారం తెలుస్తుంది. టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ గా అవతరించే క్వాలిటీస్ అన్నీ ఉన్న విశ్వక్ సేన్ కథల ఎంపికలో కొంచెం ఫోకస్ చేస్తే మాత్రం నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో హిట్లు అందుకుంటాడు. మరి విశ్వక్ సేన్ 100 కోట్ల కలను నిజం చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి. ఈ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా తన ఫుల్ ఎఫర్ట్స్ తో ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు విశ్వక్ సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి: