సెలబ్రిటీలు అండ్ సినీ తారలకు మంచి గుర్తింపు తేవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంస్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్ ఛానల్ వంటి మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారం లో అభిమానులకు టచ్ లో ఉంటారు. అయితే అభిమాన హీరో లేదా హీరోయిన్లు బాడీ ఇమేజింగ్ , గ్లామర్ వంటివి అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతుంటాయి. దీంతో వారు కూడా అభిమానుల కోసం బోల్డ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు. కానీ మరి అశ్లీల ఫోటోలు దాదాపు ఏ హీరోయిన్లు కూడా షేర్ చేయరు.

కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో అశ్లీల దృశ్యాలు ఉండడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే జాన్వి కపూర్ పేరుతో ఉన్న ఎక్స్ వేదికగా అశ్లీల చిత్రాలు కనిపించడం ప్రేక్షకుల నుంచి రకరకాలుగా కామెంట్లు అండ్ విమర్శలు రావడంతో చివరికి జాన్వి కపూర్ టీం స్పందించింది. జాన్వికి అసలు ఎక్స్ అకౌంటు లేదని సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఉన్నది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది.

అటువంటి నకిలీ ఖాతాలు అండ్ నకిలీ సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని అనుమానం వచ్చిన వెంటనే సమాచారాన్ని అందించాలని జాన్వి కపూర్ టీం అభిమానులకు తెలియజేసింది. ఇక జాన్వి సినీ కెరీర్ గురించి చెప్పుకుంటే ఆమె దివంగత శ్రీదేవి కూతురుగాసిని ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది జాన్వి కపూర్. ఇక తన ఫస్ట్ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందిన ఉన్న సినిమాలో కూడా అవకాశం కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: