తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి వయసు పెరిగిన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుస విజయాలతో విరు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకుంటూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ అనేక సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. అందులో ఒక సారి ఒకరు గెలిస్తే, మరొక సారి మరొకరు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి జనవరి 12 వ తేదీన విడుదల కాగా, ఆ తర్వాతి రోజు అనగా జనవరి 13 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయింది.

ఈ రెండు మూవీ లకు కూడా మంచి టాక్ లభించింది. దానితో ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్న ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ గా మాత్రం వాల్టేరు వీరయ్య నిలిచింది. ఇకపోతే మరోసారి వీరిద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ యొక్క చిత్రీకరణ "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే కానీ జరిగితే మరోసారి ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: