తమిళనాడులో శ్రీ లక్ష్మీ మూవీస్ వారు కల్కి చిత్రం తమిళ వెర్షన్ ని భారీగా రిలీజ్ చేయనున్నారు. వారు గతంలో పుష్ప సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. వీరు ప్రస్తుతం శివ కార్తికేయన్, ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.రేపు చెన్నై లోని లీలా ప్యాలస్ లో గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో 27 వ తేదీన 4 am షోస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మిడ్ నైట్ షోలు మాత్రం చాలా లిమిటెడ్ గా ప్లాన్ చేస్తున్నారు.ఇంకోక వారం రోజుల్లో కల్కి చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే ఇంకా దిశా పటాని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేసారు. ఈ నేపధ్యంలో ఏయే భాషల్లో ఎవరి ఇమేజ్ తో ఈ సినిమా ముందుకు వెళ్తుందనే చర్చ అందరిలో మొదలైంది.


తెలుగుకు వచ్చేసరికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడు చాలు, మిగతా వాళ్లను జనాలు పట్టించుకోరు. దానికి తోడు తెలుగులో ప్రతిష్టత్మకమైన బ్యానర్, మహానటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు కావటం కూడా కలిసోస్తుంది. అదే నార్త్ సైడ్ కూడా ప్రభాస్ కు బాహుబలి,సాహో చిత్రాలతో ఇంకా సూపర్ ఇమేజ్ వచ్చింది.ఇంకా అలాగే దీపికా పదుకోన్ దిశా పటాని ఇంకా అమితాబ్ వంటి మహానటుడు ఉండటం కూడా ప్లస్ అవుతోంది. ఇక కమల్ కు క్రేజ్ సూపర్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.బాహుబలి సినిమా తర్వాత తమిళంలో తెలుగు భారీ చిత్రాలకు కాస్త డిమాండ్ అనేది ఏర్పడింది. ప్రభాస్ గత సినిమాలు సలార్, ఆదిపురుష్ రెండు కూడా తమిళనాట నిరాశ పరిచాయి. ఆదిపురుష్ మూవీకి అక్కడ కనీసం 5 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. సలార్ సినిమాకి  దాదాపు 20 కోట్లు దాకా గ్రాస్ వచ్చింది. అంటే షేర్ పది నుంచి 12 మధ్య వచ్చింది. కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ 22 కోట్లుగా ఫిక్స్ చేసారు. అంటే గ్రాస్ వచ్చేసి 40 కోట్లు దాకా రావాలి. దాంతో ప్రభాస్ మీద కన్నా అక్కడ బిజినెస్ కమల్ ని దృష్టిలో పెట్టుకుని అంచనాని వేస్తున్నారు. విక్రమ్ తో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న కమల్ సినిమాకు వచ్చే ఓపినింగ్స్, కలెక్షన్స్ మామూలుగా ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: