తమిళ సూపర్ స్టార్ నార్త్ టు సౌత్ సూపర్ క్రేజ్ ఉన్న తలైవ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా రుచించలేదు. ప్లాప్ అయింది. సొంత భాష తమిళ్ లో కూడా యావరేజ్ గానే ఆడింది. అయితే రిలీజ్ కి ముందు హడావుడి మామూలుగా జరగలేదు.ఏకంగా 'భాషా' రేంజ్ లో సినిమా ఉంటుందని ఒకటే ప్రచారం సాగింది. కాని తొలి షోతోనే 'కాలా' సత్తా ఏంటో తేలిపోయింది. అయితే ఇప్పుడీ సినిమాకే అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21వ శతాబ్ధపు అద్భుతమైన 25 చిత్రాల జాబితాలో ఈ సినిమా స్థానం సంపాదించింది. ఈ మ్యాగజైన్ లో స్థానం సంపాదించిన తొలి భారతీయ సినిమా గా కాలా సినిమా రికార్డు సృష్టించింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలు ఈ జాబితాలో స్థానం కోసం ఎంతగానో పోటీ పడుతుంటాయి. 


వాటిలో కేవలం కొన్నింటికి మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కుతుంది. అందులో ఇండియా నుంచి అందులోనూ సౌత్ నుంచి తమిళ సినిమా ఎంపికవ్వడం విశేషం.ఈ జాబితాలో 'ఓల్డ్ బోయ్,' 'గెట్ ఔట్', 'ఆర్టిఫిషియల్', 'ఇంటెర్ వర్షన్' లాంటి చిత్రాలున్నాయి. 2000 సంవత్సరం నుంచి 2024 మధ్యలో వచ్చిన సినిమాల్లో అన్ని విభాగాలను పరిశీలించి అత్యుత్తమ ప్రదర్శన కలిగిన 25 సినిమాలని ఎంపిక చేసారు.ఏడాదికి ఒక సినిమా చొప్పున తీసుకున్నామని ఆ కమిటీ తెలిపింది. ఒక్కో విమర్శకుడు కూడా ఒక్కో సినిమాను ప్రతిపాదించినట్లు చెప్పారు.ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ 'కాలా' సినిమా కథ విషయానికి వస్తే ముంబై మురికివాడ ప్రాంతం- రియల్ ఎస్టేట్ టైకూన్ మధ్య జరిగే స్టోరీ ఇది. ఈ సినిమా కథ బలంగా ఆసక్తికరంగా ఉన్నా కానీ అంతే బలంగా తెరపై ఆవిష్కరించడంలో మాత్రం తప్పిదాలు దొర్లాయి. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో వసూళ్లు రాబట్టలేదు. కానీ ఇప్పుడు ఈ రేర్ రికార్డ్ సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: