హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ హిందూపురం నుండి వరసగా మూడవసారి విజయం సాధించి తన రెండు పడవల ప్రయాణాన్ని చాల విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా తన రాజకీయాలను కొనసాగిస్తూనే మళ్ళీ బాలయ్య తన సినిమాల వైపు దృష్టిపెట్టి ఈ నెలలోనే మళ్ళీ హూటింగ్ లకు రెడీ అవుతున్నాడు.



ప్రస్తుతం బాబి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటున్నారు. లేటెస్ట్ గా జరిగిన బాలకృష్ణ పుట్టినరోజునాడు విడుదల చేయబడ్డ ఈ మూవీ టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈ మూవీ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాల మెయిన్ హీరోయిన్ గా చాందినీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.



వాస్తవానికి ఈ మూవీని దసరా రేస్ లో విడుదల చేయాలని భావించారు. అయితే ఎన్నికల అడ్డంకి రావడంతో ఈమూవీ షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోవడంతో ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ షూటింగ్ స్పీడ్ పెంచారు. మరో రెండు నెలలలో ఈ మూవీ షూటింగ్ ను వేగంగా పూర్తిచేసి డిసెంబర్ రెండవ వారంలో ఈ మూవీని విడుదల చేయాలని గట్టి పట్టుదల పై ఉన్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ‘అఖండ’ సెంటిమెంట్ ప్రభావితం చేసింది అని అంటున్నారు.



మూడు సంవత్సరాల క్రితం డిసెంబర్ లో విడుదలైన ‘అఖండ’ సూపర్ సక్సస్ అవ్వాడమే కాకుండా బాలయ్య ఇమేజ్ ని విపరీతంగా పెంచింది. ఇప్పుడు మళ్ళీ అదే డిసెంబర్ సెంటిమెంట్ ను బాలయ్య బాబీల సినిమాకు రిపీట్ చేయాలని ఈమూవీ నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అవ్వగానే వెంటనే ‘అఖండ 2’ సెట్స్ పైకి తీసుకు వెళ్ళాలని బాలయ్య బోయపాటిల ఆలోచన అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: