బాలకృష్ణ @50ఏళ్ళు: వాటే జర్నీ.. జై బాలయ్య!తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సీనియర్ స్టార్ హీరోగా ప్రస్తుతం దూసుకుపోతున్న న‌ట‌సింహ బాల‌కృష్ణ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తన 14 ఏళ్ల వ‌య‌సులో న‌టుడిగా తెరంగేట్రం చేసారు. తండ్రి ఎన్టీరామారావుతో క‌లిసి చాలా సినిమాలు చేసారు. 1974 లో 'తాత‌మ్మ క‌ల‌'సినిమాతో తొలిసారి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇక ఆ త‌ర్వాత 'రామ్ ర‌హీమ్' నుంచి 'సింహం న‌వ్వింది' దాకా ఎన్నో సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో మెప్పించారు. ఆ తరువాత 1983లో' సాహ‌స‌మే జీవితం'తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్క‌డ నుంచి బాల‌య్య జ‌ర్నీ ఎలా సాగిందో తెలిసిందే. తాజాగా 2024 వ సంవత్సరంలో బాల‌య్య సినీ ప్ర‌స్థానం మొద‌లై 50 ఏళ్లు పూర్త‌వుతుంది. 1974-2024 దాకా చూసుకుంటే బాల‌య్య ఎన్నో చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఇప్ప‌టి దాకా 108 సినిమాలు చేసారు. ప్ర‌స్తుతం 109వ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. 110వ సినిమా కూడా బోయ‌పాటి శ్రీను తో లాక్ చేసారు.హీరోగా బాలకృష్ణ కెరీర్ ప్రారంభ‌మైన త‌ర్వాత అన్ని ర‌కాల పాత్ర‌ల‌తోనూ మెప్పించారు. హీరోగా ఇంకా విల‌న్ గా వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించి ప‌రిపూర్ణ న‌టుడిగా కొన‌సాగారు. ముఖ్యంగా బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసిన సినిమాలెన్నో ఉన్నాయి.


మొదటి సారి 'అపూర్వ స‌హోద‌రులు' సినిమాతో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ ప్ర‌స్థానం మొద‌లైంది. ఆ త‌ర్వాత 'రాముడు-భీముడు', 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌', 'ఆదిత్య 369', 'మాతో పెట్టుకోకు', 'శ్రీకృష్ణార్జున విజ‌యం', 'పెద్ద‌న్న‌య్య‌', ' సుల్తాన్', 'చెన్న కేశ‌వరెడ్డి', 'అల్ల‌రి పిడుగు' ఇలా చాలా సినిమాల్లో ద్విపాత్రాభినయంతో అల‌రించారు.మాస్ తో పాటు క్లాస్ ఆడియ‌న్స్ ని మెప్పించే చాలా సినిమాలు చేసారు. అయితే ఆయ‌న‌కు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ మాత్రం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఆయ‌న‌లో ఉండే యాంగ‌ర్ బాల‌య్య‌కి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఆ ఇమేజ్ ని డైరెక్టర్ బోయ‌పాటి తెలివిగా ఎన్ క్యాష్ చేయ‌గ‌లిగారు. బోయ‌పాటి శీను తెర‌కెక్కించిన 'సింహ‌', 'లెజెండ్', 'అఖండ' లాంటి సినిమాలతో బాలయ్య కెరీర్ బెస్ట్ బ్లాక్ బ్లస్టర్స్ అందుకున్నారు. ఒకానొక ద‌శ‌లో రెగ్యుల‌ర్ జోన‌ర్ లో సినిమాలు చేయ‌డంతో ఆయనకి స‌రైన ఫలితాలు రాలేదు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో బాల‌య్య లో కొత్త యాంగిల్ బ‌య‌ట‌కు తెచ్చి బోయ‌పాటి ట్రై చేసి సూపర్ స‌క్సెస్ అయ్యారు. అప్ప‌టి నుంచి బోయ‌పాటి-బాల‌య్య కాంబినేష‌న్ అంటే టాలీవుడ్ లో ఓ సంచ‌ల‌నంగా మారింది.అందుకే బాలయ్య 110వ సినిమా బాధ్య‌త‌లు కూడా బోయ‌పాటి శ్రీనుకి అప్ప‌గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: