![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chance-in-that-star-hero-movie-rs-5-crore-offer-anushka-rejected7036fbd1-1d67-4667-aef9-922ab8661742-415x250.jpg)
తెరపై తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అనుష్క శెట్టి. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ తో బాహుబలి లో నటించింది. బాహుబలి మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో అనుష్క శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఈ సినిమా అనంతరం ఇండస్ట్రీకి చాలా కాలం గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి చిత్రంతో రియంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ లతో సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక అనుష్క ప్రస్తుతం క్రిష్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తుంది. ఓ భారీ బడ్జెట్ మూవీ లో స్టార్ హీరో సరసును అనుష్కని హీరోయిన్గా ఎంపిక చేయగా.. ఆమె నో చెప్పినట్లు తాజాగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదని అందుకే ఈ పాత్రను రిజెక్ట్ రిజెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. అయితే ఈ పాత్రకి 5 కోట్ల వరకు ఆఫర్ చేశారట మేకర్స్. అయినప్పటికీ అనుష్క దీనికి ఒప్పుకోలేదట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.