వరుణ్ సందేశ్.. సక్సెస్ అనే మాట విని చాలా కాలం అవుతుంది. విజయం కోసం తన స్టైల్ మార్చుకునే వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో చేసిన మూవీ నింద. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో రూపొందిన ఈ చిత్రం కు రాజేష్ డైరెక్షన్ వహించాడు. శుక్రవారం అనగా నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:
మంజు (క్యూ మధు) అనే యువతని రేప్ చేసి చంపేశాడని కాండ్రకోటకు చెందిన బాలరాజును (చత్రపతి శేఖర్) పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాలరాజు పొలంలోనే మంజు సెవెన్ దొరకడం జరుగుతుంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ తో పాటు డిఎన్ఏ రిపోర్ట్స్ లో బాలరాజు తప్పు చేశాడని నిరూపణ కావడంతో అతడికి జడ్జ్ సత్యానందన్ (తనికెళ్ల భరణి) అతడికి ఉరిశిక్ష విధిస్తాడు. కానీ బాలరాజు నేరం చేయలేదని సత్యానంద్ నమ్ముతాడు. నిర్దోషికి శిక్ష పడుతుందనే బాధతో తాను జాబ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. అనంతరం మనోవేదనతోనే కన్నుమూస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం హ్యూమన్ రైట్ స కమిషన్ లో పనిచేస్తున్న సత్యానందన్ కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) బాలరాజు కేసునురి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. వివేక్ ఇన్వెస్టిగేషన్లో ఏం ప్రూవ్ అయింది? నిజంగా బాలరాజే మంజూరు హత్య చేశాడా? ఈ హత్యకు బాలరాజు కూతురు సుధా కు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.

ఆడియన్స్ రెస్పాన్స్:

సినిమా కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ. ఈ సినిమాపై ఎటువంటి హైప్స్ లేకుండా థియేటర్ కి వెళ్తే పక్కాగా మెప్పిస్తుంది. కానీ భారీ హైబ్స్ తో థియేటర్ కి వెళ్తే పెద్దగా ఆకట్టుకోలేక పోతుందని ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు. మొత్తానికి వరుణ్ సందేశ్ మూవీ థియేటర్ల వద్ద మిక్స్డ్ టాక్ దక్కించుకుంటుంది. మరి రానున్న రోజుల్లో తన జోరును పెంచి ఏమాత్రం కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.

రేటింగ్: 2.75/5

మరింత సమాచారం తెలుసుకోండి: