ఇప్పటికే కల్కే సినిమాకు సంబంధించి పాటలు టీజర్ ట్రైలర్లను విడుదల చేయగ తాజాగా రెండవ ట్రైలర్ను కూడా గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసింది. ఇప్పటికే కల్కి సినిమా ఫ్రీ బుకింగ్ టికెట్లు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఏకంగా ఇతర దేశాలలో రెండు మిలియన్ల టికెట్లు కూడా అడ్వాన్సింగ్ బుకింగ్ కావడంతో ప్రభాస్ రేంజ్ రోజ్ రోజుకి పెరుగుతోంది. తాజాగా కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ ని సైతం చిత్ర బృందం విడుదల చేశారు.
ఫైనల్ వార్ పేరుతో ఓ ట్రైలర్ను రిలీజ్ చేసిన చిత్ర బృందం గతంలో విడుదల చేసిన ట్రైలర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయి విజువల్స్ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది.ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమలహాసన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా నటిస్తూ ఉన్నారు. దీపికా పదుకొనే , దిశాపటాని వంటి వారు ప్రభాస్ కు జోడిగా నటిస్తున్నారు. మేకర్స్ కూడా చివరిలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందంటూ తెలియజేశారు అలాగే బుజ్జి అంటూ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేసి మరింత హైప్ పెంచారు. మరి మొత్తానికి జూన్ 27వ తేదీ వరకు అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూడాల్సిందే.