"జర్నీ ఆఫ్ కల్కి" పేరుతో ప్రీ ప్రిల్యూడ్ వీడియోలను కూడా విడుదల చేశారు. వీటిలో దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ పంచుకున్నారు. ఇక కొత్త ట్రైలర్ కూడా చాలా వివరాలను బయటపెట్టింది దీంతో అంచనాలు మరో స్థాయి చేరుకున్నాయి. చాలామంది టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అదేంటంటే తెలంగాణ గవర్నమెంట్ కల్కి సినిమా టికెట్ల ధరలను పెంచుకునేటట్లు మూవీ మేకర్స్ కి పర్మిషన్ ఇచ్చింది.
జూన్ 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరలు నచ్చిన విధంగా పెంచుకోవచ్చని ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే టికెట్ ధరల పెంపు, అడిషనల్ షోలకు అనుమతి ఇవ్వాలని ఇటీవల వైజయంతీ మూవీస్ అప్లికేషన్ పెట్టుకుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం వారికి అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, కల్కి సినిమా టికెట్ పై మ్యాగ్జిమం రూ.200 పెంచుకోవచ్చు. మామూలు థియేటర్లలో టికెట్ రేట్‌ను రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంచొచ్చు. జూన్ 27న ఉదయం 5:30 గంటలకు స్పెషల్ షో కూడా వేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్‌లో డైలీ ఐదు షోలు కూడా ప్లే చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తారని సమాచారం. ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.