పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన స్థాయి ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. పవన్ సినిమాలలో స్టార్ స్టేటస్ ఉన్న హీరోగా కెరీర్లు ముందుకు సాగిస్తున్న సమయంలోనే జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. 2014 లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొదటి సారి ఎమ్మెల్యే గా గెలుపొంది అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు. ఇక ఈయన పార్టీ నుండి పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు , ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా గెలుపొందారు.

ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఓ రెండు సినిమాలను నేను డబ్బు కోసమే చేశాను అని చెప్పాడు. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... నేను గబ్బర్ సింగ్ , సర్దార్ గబ్బర్ సింగ్ రెండు సినిమాలను కూడా డబ్బు కోసమే చేశాను. ఆ సినిమాల ముందు ఆర్థికంగా నా పరిస్థితులు అస్సలు బాగోలేవు. కొంత మంది కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది.

అప్పులు బాగా ఉండటంతో అవి తీర్చాలి అనే ఉద్దేశంలో ఏ సినిమాల షూటింగ్స్ అయితే తొందరగా పూర్తి అవుతాయో అలాంటి మూవీలు చేస్తే మంచిది అనే ఉద్దేశం లోనే ఆ మూవీలను చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించగా, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. గబ్బర్ సింగ్ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ,  హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: