అందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎనిమిది రోజుల వరకు స్పెషల్ షోలు వేసుకోవచ్చు అని, టికెట్ ప్రైస్‌లు పెంచుకోవచ్చని మూవీ మేకర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే తెలంగాణలో ఎలాగూ సినిమా ఇండస్ట్రీ వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరనే నమ్మకం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నుంచి అనుమతులు రావడం ముందుగా ఊహించినదే! మరి ఏపీ ప్రభుత్వం ప్రభాస్ మూవీ మేకర్స్ టికెట్ ప్రైస్ లు పెంచుకోవడానికి అనుమతిస్తుందా? స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
సినిమా థియేటర్లలో విడుదల కావడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఈ విషయమై మూవీ మేకర్స్ నేడు లేదంటే రేపు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా రిలీజ్ లకు సంబంధించి చాలానే ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆయన దిగిపోయారు నేడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కాబట్టి సినిమా వాళ్లకు 100% న్యాయం చేస్తారని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి కల్కి 2898 AD సినిమాకు అనుమతులు లభించడం ఖాయమని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.