సినిమాల్లోకి చాలామంది వస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద హీరోలు అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం కెరియర్లో ఇబ్బందుల్ని ఎదుర్కోవడం వలన అవకాశాలని కూడా కోల్పోతూ ఉంటారు. సినిమా రంగంలో నెపోటిజం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం తర్వాత ఈ పదం బాగా వినపడింది. సీనియర్ నటుడు గిరిబాబు ఒక ఇంటర్వ్యూలో తాను కూడా ఇలాంటి బాధితుండని చెప్పుకు రావడం జరిగింది. తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని చూసినా నటులు ఒక్కొక్కరే ప్రేక్షకుల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోగా ఆ తరానికి ప్రతినిధిగా మిగిలిన కొందరిలో గిరిబాబు ఒకరు. ఆయన హీరోగా విలన్ గా హాస్యనటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిర్మాతగా దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. దాదాపు 600 కు పైగా సినిమాల్లో నటించి అందర్నీ మెప్పించారు. దేవతలారా దీవించండి సినిమాతో దర్శకుడుగా మారారు.

తన వారసులుగా రఘుబాబు, బోసు బాబులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గిరిబాబు బోసును హీరోను చేయాలని ఆయన కలలు కన్నారు. అప్పటికే దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిబాబు తన కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చూసారు. స్వీయ దర్శకనిర్మానంలో ఇంద్రజిత్ ను తెరకెక్కించారు.సరిగా ఆ టైం లో చిరంజీవి కొదమ సింహం సినిమా తెరకెక్కింది ఆశ్చర్యంగా రెండు సినిమాలు ఒక రోజే విడుదల అవ్వడంతో ఇండస్ట్రీలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.  యాక్షన్ సినిమా తీయడంలో గిరిబాబుకు గుర్తింపు ఉండడంతో ఇంద్రజిత్తు పై హైప్ ఎక్కువ ఉంది. సినిమాకు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన సమయంలో కొదవ సింహం సినిమాకు సంబంధించి కొందరు రఘు బాబుకి మాయమాటలు చెప్పి హైదరాబాద్లోని ఒక ప్రివ్యూ థియేటర్లో సినిమాను చూశారు. ఇంద్రజిత్తు రిలీజ్ అయ్యే తేదీనే కొదమ సింహం సినిమాను రిలీజ్ చేశారు ఈ విషయాన్ని పేపర్లో చూసి నాకు షాక్ అయిపోయారు.


ఇంద్రజిత్ కి బయర్లు కూడా రాకపోవడంతో కొదమ సింహం రిలీజ్ విషయాలు తెలుసుకొని అంత పెద్ద స్టార్ నటిస్తున్న సినిమాను తట్టుకుని నిలబడగలరా అని ఆయనను అడిగారు. ఎంతో కష్టపడి ఇంద్రజిత్తు తాను చెప్పిన రేటు కంటే తక్కువకి అడిగారని చెప్పారు. అయితే కొదమ సింహం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించని ఫలితం రాబట్టలేదని దీంతో ఇంద్రజిత్తుకు బిజినెస్ సరిగ్గా జరగలేదని గిరిబాబు అన్నారు. మెగాస్టార్ సినిమా ఏ నష్టపోతే మీ సినిమాని ఎవరు కొంటారని అడగడంతో బడ్జెట్ కంటే తక్కువ ధరకే మూవీని అమ్మేసారట. మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ఫ్లాప్ అని ప్రచారం చేశారని ఆయన చెప్పారు.కానీ తన సినిమా బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చిందని గిరిబాబు చెప్పారు. చిన్నవాళ్లను పెద్దవాళ్లు తొక్కడం ఎక్కడైనా ఉంటుందని, తనకంటే బాగా నష్టపోయిన ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారని గిరిబాబు వెల్లడించారు. జీవితాలతో ఆడుకోవడమేనని .. తనకు అన్నలు, తమ్ముళ్లు, బావలు, బావమరుదులు ఆ సమయంలో లేరంటూ పరోక్షంగా కొందరిపై ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరెవరి హస్తం ఉందన్నది మాత్రం గిరిబాబు బయటపెట్టకపోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: