పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ దీపికా పడుకొనే కమలహాసన్ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో వేగం పెంచారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా శ్రీమహా విష్ణువు పదో అవతారం 'కల్కి'గా అవతరించే

 ఇతివృత్తాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రంగా తీర్చిదిద్దారు. కల్కి అవతరించడానికి ముందు అంటే, 2898 ఏడీలో జరిగే పరిణామాలతో ఫిక్షనల్‌ కథగా ఈ చిత్రం  సాగుతుంది. ఈ కథకు మహాభారతంలో అశ్వత్థామ పాత్రను కలుపుతూ డిజైన్‌ చేసుకున్నారు. ఇకపోతే  ప్రభాస్‌  ఇందులో భైరవ అనే బౌంటీ హంటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను కూడా పురాణాల నుంచి తీసుకుని డిజైన్‌ చేసుకున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. భైరవుడు అంటే శివుడి అంశ. ఆయన ఆవిర్భావం కూడా విచిత్రంగా ఉంటుంది. పరమ శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి. అలాగే 'కల్కి 2898 ఏడీ'లో ప్రతినాయకుడు సుప్రీం యాస్కిన్‌ పాత్రను కమల్‌హాసన్‌

  పోషిస్తున్నారు. ఆయన గెటప్‌, ఆహార్యం పూర్తి డిఫరెంట్‌గా ఉన్నాయి. దీంతో ఈ పాత్ర ఎక్కడినుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నారా? అన్న ఆసక్తి మొదలైంది. 'కల్కి' టీజర్‌ విడుదలైన సమయంలో 'కమల్‌ హాసన్‌ ఎక్కడ' అని ఒక విలేకరి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ను ప్రశ్నించగా, 'టీజర్‌ మొత్తంలో ఆయనే ఉన్నారు' అని సమాధానం ఇచ్చారు.   అంతేకాదు ఈ మూవీలో మరో కీలక పాత్ర పోషిస్తోంది దీపిక పదుకొణె . గర్భిణి అయిన ఈ పాత్రను 'సమ్‌-80'గా వ్యవహరిస్తున్నారు. 'భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందని అంటారు. అలాంటిది మీ కడుపున ఆ భగవంతుడే ఉన్నాడు' అని ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ పాత్ర అంటుంది. అంటే 'కల్కి' పుట్టిబోయేది ఆమె కడుపునే అన్నది అర్థమవుతోంది. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: