కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏ మాత్రం చీలకూడదు అనే ఉద్దేశంతో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇలా పొత్తులో భాగంగా పోటీలోకి దిగడం వల్ల మూడు పార్టీలకు సీట్లను కేటాయించడం వల్ల అనేక రోజులుగా ఒక ప్రాంతం నుండి ఓ పార్టీ సీట్ ను ఆశించిన చివరకు పొత్తుల భాగంగా వేరే పార్టీకి ఆ సీటు వెళ్లడంతో కొంతమంది వారి సీట్లను త్యాగం చేయవలసి వచ్చింది. అలా త్యాగాలు చేసిన సమయంలో పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లు అయితే మీకు మంచి మంచి పదవులు ఇస్తాము అని బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక సీట్లను త్యాగాలు చేసిన వారు కొన్ని కీలక పదవులను ఆశిస్తూ ఉన్నారు. అందులో సుగుణమ్మ ఒకరు. తెలుగు దేశం పార్టీ నాయకురాలుగా తిరుపతి నియోజకవర్గం లో ఈమె ఎన్నో రోజులుగా పని చేస్తున్నారు. దానితో ఈమె ఈ సారి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే సీటును ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు దక్కింది.

దానితో సుగుణమ్మ ను పక్కన పెట్టి జనసేన అభ్యర్థి అయినటువంటి అరణి శ్రేణవాసులు ఈ ప్రాంత సీటును ఇచ్చారు. ఇక ఈయన అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. దానితో తాను గెలిచే అవకాశం ఉన్నా కూడా తనను పక్కన పెట్టినందుకు గాను ఈమె పార్టీ అధికారంలోకి రావడంతో ఈమె టిటిడి బోర్డు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పార్టీ కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన సుగుణకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని చంద్రబాబు ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. మరి వారందరినీ కాదని చంద్రబాబు నాయుడు, సుగుణమ్మ కి మొదటి ప్రాముఖ్యతను ఇస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: