నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి.  ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నారు చిత్ర బృందం. మహానటి సినిమాతో డైరెక్టర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన. ఇప్పుడు కల్కి సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. దానికి తగ్గట్లుగానే కల్కి సినిమాకి సంబంధించిన పనుల విషయంలో అనేకమైన జాగ్రత్తలను వహిస్తున్నారు. దీని ప్రమోషన్స్ విషయంలో కూడా కొత్తదనాన్ని

 చూపిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమాని 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దాంతో ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. దాంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా

 హైలైట్ గా ఉంటాయి అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి. ఆ విషయాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సినిమాలో కొన్ని సీన్లు హైలైట్ గా నిలువబోతున్నాయట అవి ఏంటి అంటే ప్రభాస్ అమితాబచ్చన్ లా మధ్య నడిచే ఫైట్ సీక్వెన్స్ ఒకటైతే, ప్రభాస్ కల్కి ని కాపాడే మరొక ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్… ఈ సినిమాలో ఈ మూడు మాత్రం భారీ హైలెట్ గా నిలవబోతున్నాయని సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి ఇవి ఏ రేంజ్ లో ఉంటాయి అనేది తెలియాలంటే ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా బుక్ మై షో లో ఈ సినిమా టికెట్లను పెడితే పెట్టిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: