ప్రస్తుతం త్రిష ఫుల్ ఫాంలో ఉంది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష వరుస చిత్రాలు చేస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీలో త్రిష యాక్ట్ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇంకా అజిత్ కుమార్ విడా మయురచ్చి మూవీలో కూడా ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది త్రిష.ఇంకా అలాగే వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ డ్రామాగా వెంకట్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే విజయ్, త్రిష కాంబోకు ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. ఇప్పటి దాకా నాలుగు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ ఇచ్చే ముందు చేయనున్న మరో సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ అని సమాచారం తెలుస్తుంది.అయితే రీసెంట్ గా హీరో విజయ్.. తన 50వ బర్త్ డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ త్రిష.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరూ లిఫ్ట్‌ లో దిగిన ఫోటోను షేర్ చేసింది. క్రేజీ క్యాప్షన్ ఇచ్చి ఇంగ్లీష్ సాంగ్ ను కూడా యాడ్ చేసింది. ఇక ఆ ఫోటోను త్రిష తీయగా.. ఇద్దరూ ఫ్రెషల్ లుక్ లో కనిపించారు. దీంతో ఆ పిక్ ఫుల్ వైరల్ గా మారింది. 


పిక్ చాలా బాగుందని నెటిజన్లు చాలా కామెంట్లు పెట్టారు. అదే సమయంలో  కొత్త రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.హీరో విజయ్ కు 24 ఏళ్ల క్రితం.. ఓ బడా పారిశ్రామిక వేత్త కుమార్తె సంగీతతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సంగీతమూవీ షూటింగ్ సమయంలో విజయ్‌ ను కలిసింది. ఆ తర్వాత పెద్దలు మాట్లాడుకుని 1999 ఆగస్టు 25 వ తేదీన వివాహం జరిపించారు. జాసన్ సంజయ్ ఇంకా దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ విజయ్, సంగీత వేర్వేరుగా ఉంటున్నట్లు, విడాకులు తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో అనేక వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు త్రిష.. విజయ్ బర్త్ డే సందర్భంగా పోస్ట్ పెట్టిన తర్వాత కొంతమంది దుష్ప్రచారం చేశారు. విజయ్, త్రిష మధ్య ఏదో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లేముందు ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.ఇంకా అనవసరమైన గాసిప్స్ క్రియేట్ చేయొద్దని కూడా చురకలు అంటిస్తున్నారు. అయితే ఈ విషయంపై విజయ్, త్రిషలో ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: