28 ఏళ్ళ క్రితం శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా ఈ సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.అవినీతి చేసాడని కన్న కొడుకుని కూడా చంపేసే తండ్రిగా ఆ మూవీలో సేనాపతి పాత్ర ఉంటుంది. కమల్ హాసన్ ఇండియన్ లో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు.అయితే మూవీ ఎండింగ్ లో సేనాపతి దేశం విడిచి వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా నా అవసరం పడితే తిరిగి వస్తా అని క్లైమాక్స్ లో చెబుతాడు. ఇన్నేళ్ల తర్వాత శంకర్ మళ్ళీ సేనాపతిని ఇండియాకి తిరిగి తీసుకొస్తూ ఇండియన్ 2 మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇండియన్ 2 మూవీకి సంగీతం అందిస్తున్నాడు.


ఇండియన్ కి సీక్వెల్ గా వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ తో సినిమా కంటెంట్ ఏంటనేది రివీల్ అయ్యే అవకాశం ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ రన్ టైం ని డైరెక్టర్ శంకర్ లాక్ చేశాడంట. 2 గంటల 55 నిమిషాల నిడివితో ఇండియన్ 2 సినిమా  ఉండబోతోందంట. దాదాపు మూడు గంటలు ఉందంటే రిస్క్ తీసుకుంటున్నారు అనే చెప్పాలి. ఈ ఇండియన్ సినిమా నిడివి అప్పట్లో 185 నిమిషాలు. అంటే మూడు గంటలు పైనే ఉంటుంది. ఇక ఈ రోజుల్లో ఆ స్థాయిలో నిడివి అంటే ఆడియెన్స్ ను మెప్పించడం అంత మాములు విషయం కాదు.ఖచ్చితంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి.మరి శంకర్ ఆలోచనా విధానం ఎలా ఉందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.సిద్ధార్ధ్ కి జోడీగా ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోంది. వీరిద్దరి మీద షూట్ చేసిన సాంగ్ ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇండియన్ 2 మూవీలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: