2020 లో నిర్మాత శివ ప్రకాష్ ను,సంజన గల్రానీ నీ అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు జైల్లో ఉన్న ఈమె అనారోగ్య సమస్యలతో డిసెంబర్ నెలలోనే బయలు మీద విడుదలయ్యింది. తన మీద ఉన్న ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ సంజన, శివప్రసాద్ హైకోర్టును సైతం ఆశ్రయించడం జరిగింది. ఈ రోజున ఇందుకు సంబంధించి విచారణ జరిపి ఎఫ్ఐఆర్ ని కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని రాయల్ సూట్స్ హోటల్లో సినీ నటులు వ్యాపారవేత్త పిల్లలు సైతం డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఆగస్టు 26న 2020లో ఎన్ సి బి అధికారులు దాడులు చేయడం జరిగింది.
దీంతో అక్కడ అధికారులకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సప్లయర్స్ తోపాటు హీరోయిన్ సంజన తోపాటు హీరోయిన్ రాగిణి ద్వితేది, నిర్మాత శివప్రకాష్ ను అదుపులోకి సైతం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ కేసులో చాలామంది కూడా అరెస్టు అయినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసు పైన విచారణ జరిపి ఈరోజు కోర్టు పిటిషన్ ని రద్దు చేసింది. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండవ హీరోయిన్గా త్రిష చెల్లెలుగా నటించింది.