కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఈయన కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో డేవిడ్ బిల్లా మూవీ ఒకటి. ఈ మూవీ కి చక్రి తోలేటి దర్శకత్వం వహించగా ...  విద్యుత్ జమ్వాల్ , బ్రూనా అబ్దుల్లా , పార్వతి ఓమనకుట్టన్ , సుధాంశు పాండే , మనోజ్ కె. జయన్ , కృష్ణకుమార్ , యోగ్ జపీ , రోహిత్ ఖురానా , దినేష్ లాంబా , రెహమాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. 

యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను 2012 వ సంవత్సరం జూలై 13 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కంటే ముందు బిల్లా సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఆ మూవీ కి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు  కానీ తెలుగు లో ఈ సినిమా భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో తెలుగు లో రీ రిలీస్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువబడింది. ఈ సినిమాను జూలై 5 వ తేదీన పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: