తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్లలో ముక్కు అవినాష్ ఒకరు. ఈయన ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ తనకు అంత గొప్ప గుర్తింపుని తెచ్చిపెట్టిన జబర్దస్త్ మానేసి ప్రస్తుతం ఈయన స్టార్ మా చానల్లో అనేక షో లలో పాల్గొంటున్నాడు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను వివరించాడు. జీవితంలో ఎదగడం కోసమే జబర్దస్త్ మానేశాను. ఎందుకు అనుకుంటున్నారా ... నేను జబర్దస్త్ చేస్తున్న సమయంలో కొన్ని అప్పులు చేశాను.

ఇక కరోనా సమయంలో అవి తీర్చడం చాలా కష్టం అయ్యింది. అలాంటి సమయంలో అప్పులు తీర్చలేక ఒకానొక దశలో నేను ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాను. అలాంటి సమయం లోనే నాకు బిగ్ బాస్ నుండి అవకాశం వచ్చింది. దాని నుండి వచ్చే డబ్బులతో నా అప్పులు తీర్చుకోవచ్చు అని నేను అనుకున్నాను. కాకపోతే నేను అప్పటికే జబర్దస్త్ చేస్తూ ఉండడం వల్ల నేను ఆ సంస్థకు అగ్రిమెంట్ చేశాను. ఆ అగ్రిమెంట్ ను కాదని నేను వేరే ఛానల్ షో కు వెళ్లినట్లయితే పది లక్షల డబ్బులు కట్టాలి.

అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అలాంటి సమయంలో శ్రీ ముఖి నాకు ఐదు లక్షలు సహాయం చేసింది. మరి కొంత మంది స్నేహితులు , బంధువులు మరో ఐదు లక్షలు ఇచ్చారు. వాటిని కట్టి నేను జబర్దస్త్ నుండి వెళ్లిపోయి బిగ్ బాస్ లోకి చేరాను. బిగ్ బాస్ వల్ల వచ్చిన డబ్బులతో నేను నా అప్పులు అన్ని తీర్చుకొని ప్రస్తుతం సెటిల్ అయ్యాను అని ముక్కు అవినాష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈయన స్టార్ మా చానల్లో అనేక షో లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: