టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారిలో బాలయ్య మాత్రమే ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చాలా భాగం పూర్తయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా లేదా క్రిస్మస్ సందర్భంగా లేదా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ ఈమేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే మూవీ లో మాత్రమే హీరో గా నటిస్తున్నాడు. మరో మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న కథ కుదరకపోవడంతో చిరంజీవి ప్రస్తుతం కేవలం ఒకే మూవీ లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇలాపోతే విక్టరీ వెంకటేష్ ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దానితో అనిల్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వీరందరిలో నాగార్జున మాత్రం సూపర్ స్లో గా ఉన్నాడు. ఇప్పటికీ ఒక్క మూవీ ని కూడా ఓకే చేయలేదు. ప్రస్తుతం కథలు వింటున్నట్లు తెలుస్తోంది. అందులో ఏదైనా కథ అద్భుతంగా నచ్చితే దానిని ఓకే చేయాలి అనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలలో బాలకృష్ణ మాత్రమే ఓ సినిమాలో నటిస్తూ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫుల్ జోష్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: