మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు ఆయన చూడని సినీ అవార్డు లేదు, ఆయన అందుకోని హిట్ లేదు కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన అట్టర్ ప్లాప్. 2008లో ఆయన ప్రజారాజ్యం పేరిట ఒక పార్టీ పెట్టారు. దానిని 2011లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక ఆయన రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రెండు మూడు ఏళ్లతో రాజకీయాల నుంచి వెళ్లిపోలేదు పదేళ్లు కష్టపడ్డారు చివరికి టీడీపీతో కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అయితే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎంత అనుకున్నా ఏదో ఒక రూపంలో ఆయనను పాలిటిక్స్ పిలుస్తున్నాయి. ఆయన కాళ్ల వద్దకు రాజకీయ హోదాలు వచ్చి చేరుతున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ కారణంగా చిరుకు ఏపీలో ఏదో ఒక హోదా దక్కేలా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు విషయం ఇది కాదు. ఆయన వద్దకే అధికారం, అధికారులు క్యూ కడుతున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి రావాలని చిరంజీవిని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చిరంజీవిని తన కార్యక్రమాలకు ఆహ్వానించేవారు ఆ రేంజ్ లో మెగాస్టార్‌కు క్రేజ్‌ ఉండేది.

 ఎవరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా  చిరంజీవి కాలపై పడిపోయి ఆశీర్వచనాలు తీసుకున్నారు. జనసేన మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ కూడా చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇటీవల బిజెపి మంత్రి బండి సంజయ్ కూడా ఈ సినిమా హీరోని ప్రత్యేకంగా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చర్చినీయాంశంగా మారింది. న్యూట్రల్ గా ఉండటం, సినిమాల్లో బయట మంచి పేరు తెచ్చుకోవడం, చాలా పాపులారిటీని కలిగి ఉండటం వల్ల పేరు నా పొలిటిషన్ లే ఆయన ఇంటికి వెళ్లి పలకరిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు పిలుస్తున్నారు. ఆ విధంగా రాజకీయాలకు దూరంగా ఉండాలన్నా పాలిటిక్స్ మాత్రం ఆయనను వదిలేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: